మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం
రిపోర్టర్: రమేష్
స్థలం: భారతదేశం
దేశంలో మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ల ధరలు త్వరలో పెరగనున్నాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో టారిఫ్‌లు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో సంస్థలు టారిఫ్‌ల సవరణ సంకేతాలు ఇచ్చాయి. ఈ భారం నుంచి తప్పించుకోవడానికి వినియోగదారులు వార్షిక ప్లాన్‌లను ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.