దేశ సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కలెక్టర్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యత దినోత్సవం అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని నస్పూర్ లోని కలెక్టరేట్ లో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించాలని ఆయన తెలిపారు.