విజయనగరంలో జానకి సినీ సంగీత విభావరితో మైమరిపించిన గాయనీగాయకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో స్వర్గీయ జానకి గారి సినీ సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖుల సారథ్యంలో విద్యార్థులు తమ మధురమైన స్వరాలతో పాటలు పాడి సంగీత ప్రియులను ఎంతగానో అలరించారు. ఘంటసాల కళాపీఠం ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సంగీత ప్రియులకు ఒక దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్య అతిథి కాపుగంటి శ్రీనివాసరావు కొనియాడారు.