భూ భారతి అమలుపై నీలినీడలు: రాష్ట్రంలో సర్కార్ చేపట్టిన రీ సర్వే సవాళ్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
రాష్ట్రంలో ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయినా ఆశించిన ఫలితాలు రాలేదని, భూ రీ సర్వేతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అయితే పాత రెవెన్యూ రికార్డులను క్లియర్ చేయకుండా సర్వే చేయడం వల్ల తీవ్ర అనర్థాలు తలెత్తుతాయని, రికార్డుల ప్రక్షాళన చేయకుండా ముందుకు వెళ్లడం సరికాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.