మెడికవర్ దవాఖానలో జూనియర్ న్యాయవాది మృతి: ఎన్హెచ్ఆర్సీ తీవ్ర విచారణ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్లోని మెడికవర్ దవాఖానలో జూనియర్ న్యాయవాది ఐశ్వర్య మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. న్యాయవాది రేవంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎన్హెచ్ఆర్సీ వెల్లడించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ అధికారులు పేర్కొన్నారు.