పోలవరం నిర్వాసితుల కోసం చల్లావారిగూడెంలో శరవేగంగా ఇండ్ల నిర్మాణాలు

రిపోర్టర్: Alfa News స్థలం: జంగారెడ్డిగూడెం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలోని చల్లావారిగూడెంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాలనీకి నిర్వాసితులను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు త్వరలోనే శాశ్వత వసతి లభించనుంది.