బీఆర్ఎస్ పాలనలో ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి ఎందుకు కాలేదంటూ కొండా సురేఖ నిలదీత
రిపోర్టర్: రాము
స్థలం: వరంగల్
వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల తీరుపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజా ప్రభుత్వంపై బురదజల్లుతున్న బీఆర్ఎస్ నాయకులకు ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎంజీఎం ఆసుపత్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆమె నిలదీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.