చెన్నై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ కుటుంబ కలహాలు
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
అలనాటి ప్రముఖ నటి రాధ కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో ఆమె తన సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున్‌లపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారానికి సంబంధించిన రూ.46 కోట్ల విలువైన సంతకం చేసిన పాత చెక్కులను దొంగిలించి, వాటి ద్వారా నగదు విత్‌డ్రా చేసుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.