మనీలాండరింగ్ కేసులో షమ్సుల్ హుడా ఖాన్ స్థిరాస్తులు జప్తు చేసిన ఈడీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: Lucknow
బ్రిటన్ పౌరసత్వాన్ని పొంది కూడా భారత్లో ఉద్యోగం చేస్తూ అక్రమంగా వేతనాలు, పింఛన్ పొందిన షమ్సుల్ హుడా ఖాన్కు చెందిన రూ.53.46 లక్షల విలువైన స్థిరాస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని సంతో కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ఈ భూమిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.