భారత్‌తో టీ20 సిరీస్: కివీస్ జట్టులో కీలక మార్పులు చేసిన మేనేజ్మెంట్
రిపోర్టర్: రాము
స్థలం: Auckland
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మిగిలిన మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ జట్టులో పలు కీలక మార్పులు చేసినట్లు ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించారు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో పేసర్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కోసం లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ తదితరులకు విశ్రాంతినిచ్చినట్లు ఆయన తెలిపారు. జట్టులో లభించిన లోతు కారణంగానే ఆటగాళ్లను రొటేట్ చేయగలుగుతున్నామని, తద్వారా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ఆయన పేర్కొన్నారు.