షిల్లాంగ్‌లో పోలీస్ స్టేషన్‌పై పెట్రోల్ బాంబులతో దుండగుల దాడి

రిపోర్టర్: రాము స్థలం: India

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని లాబన్ పోలీస్ స్టేషన్‌పై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్టేషన్లోకి పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ फुటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.