ఢిల్లీ కాలుష్యంపై రాజకీయ రగడ: పంజాబ్ రైతులను టార్గెట్ చేయడంపై ఆప్ మండిపాటు

రిపోర్టర్: అశోక్ స్థలం: చండీగఢ్

ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు కాలుష్యంపై ఆప్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగిందని ఆప్ నేత బల్తేజ్ పన్ను మీడియా సమావేశంలో వెల్లడించారు. పంట వ్యర్థాల దహనంపై బీజేపీ నాయకులు పంజాబ్ రైతులను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వరి కోత సీజన్ ప్రారంభం కాకముందే రాజకీయ లబ్ధికోసమే బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాలుష్యానికి కేవలం పంజాబ్ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.