పంటలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఎర్రబెల్లి దయాకర్ రావు

రిపోర్టర్: రమేష్ స్థలం: జనగామ

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం బంజార గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. చెరువులకు నీరు అందించి, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని దయాకర్ రావు స్పష్టం చేశారు.