హైదరాబాద్‌లో విషాదం ముసారాంబాగ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పరిధి ముసారాంబాగ్‌లో అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా పనిచేస్తున్న ముత్తె చంద్రశేఖర్ (35) తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందడానికి ముందు ఆయన ఓ యువతికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య గురించి చెప్పడంతో, ఆ యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.