అమెరికా కంటే భారత వైద్య విధానమే మేలంటూ యువతి ప్రశంసలు

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

భారతదేశంలో వైద్య సేవలు అత్యంత సులభంగా మరియు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయని అమెరికాకు చెందిన ఒక యువతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బెంగళూరులో తాను చేయించుకున్న కంటి శస్త్రచికిత్స అద్భుత ఫలితాలనిచ్చిందని, అమెరికాతో పోలిస్తే మన దేశంలోనే వైద్య రంగం మెరుగ్గా ఉందని ఆమె ప్రశంసించారు. ఆరోగ్య బీమా లేకపోయినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆమె స్పష్టం చేశారు.