నాగోర్ లో భారీ పేలుడు: బాణాసంచా తయారీ గోదాంలో ఇద్దరు సజీవదహనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: నాగోర్

రాజస్థాన్ లోని నాగోర్ లో బాణాసంచా మరియు గన్ పౌడర్ తయారీ గోదాంలో భారీ పేలుడు సంభవించిందని, ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు రెండు కిలోమీటర్ల దూరం వరకు శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.