పీడకలలతో భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయిన స్నేహితుడిని హతమార్చిన నిందితుడు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

మహారాష్ట్ర లోని ఠాణే జిల్లా డోంబివ్లి లో స్నేహితుడిని హత్య చేసిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మోతేగావ్ ప్రాంతానికి చెందిన ప్రభు కరకాడే అనే వ్యక్తి మద్యం మత్తులో విశాల్ కదమ్ పై దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో పడేసినప్పటికీ, గత ఇరవై రోజులుగా చనిపోయిన స్నేహితుడు కలలోకి వచ్చి భయపెడుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురై నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.