మొయినాబాద్లో విషాదం: పోలీసులను చూసి పరుగెడుతూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. పెద్దమంగళారం ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా పెట్రోలింగ్ వాహనం రావడంతో భయపడి పరుగెత్తిన విద్యార్థులు, పంట పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మోక్ష సాయి చరణ్, యశ్వంత్గా గుర్తించి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.