తిమ్మంపేటలో వినాయక లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు షరీఫ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: దుగ్గొండి

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ముస్లిం యువకుడు ఎస్కే షరీఫ్ తొమ్మిది వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూను కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని షరీఫ్ తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లడ్డూ వేలం ఉత్సవం గ్రామస్థుల సమక్షంలో అత్యంత ఘనంగా ముగిసింది.