హైదరాబాద్ ప్రజలకు తీపి కబురు: అందుబాటులోకి గ్రీన్ ఎస్ఎమ్ ఎలక్ట్రిక్ క్యాబ్స్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

క్యాబ్ ఛార్జీల భారంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజలకు త్వరలోనే పెద్ద ఉపశమనం లభించనుందని గ్రీన్ ఎస్ఎమ్ సంస్థ వెల్లడించింది. వియత్నాం దేశానికి చెందిన ఈ ప్రముఖ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ తన పూర్తి ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను భాగ్యనగరంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. కిలోమీటరుకు కేవలం తొమ్మిది రూపాయలకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ నగరంలోకి అడుగుపెడుతున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.