పట్టు ధరల భారం: చేనేత కార్మికులకు చేతినిండా దొరకని ఉపాధి

రిపోర్టర్: రాజేష్ స్థలం: బాపట్ల

వాతావరణ మార్పుల కారణంగా పట్టు ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలాది మగ్గాలు ఉన్నాయని, కిలో పట్టు ధర వేయి రూపాయలు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్పత్తిదారులు వాపోయారు. సిల్క్ డిపో ఏర్పాటు చేసి ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.