వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ: దేశంలో శాంతిపై సంజయ్ దత్ కీలక ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

గాంధీ జయంతి సందర్భంగా యాంకర్ శేఖర్ సుమన్ షోలో తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా స్క్రిప్టెడ్ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పష్టం చేశారు. దేశంలో శాంతి కనిపించడం లేదంటూ తాను చేసిన కామెంట్లు వివాదం కావడంతో ఆయన వీడియో ద్వారా మరోసారి క్లారిటీనిచ్చారు. ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించవద్దని, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ఆయన చేతులు జోడించి కోరారు.