తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వినాయక నిమజ్జనం వేళ స్కూళ్లకు సెలవు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యార్థులకు రేపు సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తరాంధ్రలో కురుస్తున్న అతిభారీ వర్షాలు, తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ మళ్లింపుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.