పాత ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజల అవస్థలు.. అధికారుల తీరుపై అసహనం
రిపోర్టర్: p.g. murthy
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు జారీ చేసిన నోటీసులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని, అంతకుముందు 20 ఏళ్ల నాటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని అధికారులు కోరుతున్నారు.
పాత పత్రాలు లభించక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకోవాలని, అధికారులు తమ ఇబ్బందులను అర్థం చేసుకుని వెసులుబాటు కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.