ఐసీసీ కోడ్ ఉల్లంఘన: దక్షిణాఫ్రికా కోచ్ ప్రిన్స్, కైల్ వెర్రెన్నేలకు మొట్టికాయలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: కేప్ టౌన్

కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్, ఆటగాడు కైల్ వెర్రెన్నేలకు అధికారికంగా హెచ్చరికలు జారీ చేసినట్లు ఐసీసీ మీడియా విడుదల ద్వారా స్పష్టం చేసింది. అంపైర్ నిర్ణయంపై అసమ్మతి తెలిపినందుకు గాను ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్ ను కూడా కేటాయించినట్లు మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించారు.