ఎల్బీనగర్ జీవో 118 భూముల సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జీవో 118 భూముల సమస్యకు పరిష్కారం చూపింది. గత 15, 20 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు దీని ద్వారా భారీ ఊరట లభించింది. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను త్వరలోనే పరిష్కరించి హక్కు పత్రాలు జారీ చేసే ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.