అక్టోబర్ రెండున జీ ఫైవ్ లో మృణాల్ ఠాకూర్ పూజా మేరీ జాన్ ఓటీటీ రిలీజ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పూజా మేరీ జాన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ ఫైవ్ వేదికగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి హిందీలో స్ట్రీమింగ్ కానుంది. నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.