దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ సంచలనాలు సృష్టించనున్న సందీప్ రెడ్డి వంగా

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన సందీప్, త్వరలో పూర్తి స్థాయి నటుడిగా మారనున్నట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ బాటలోనే ఆయన కూడా ఈ ప్రయోగానికి తెరలేపినట్లు తెలుస్తోంది.