ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు.
రిపోర్టర్: విజయ్
స్థలం: వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాల్సి ఉండగా, ఉదయం 6 గంటల నుంచే షాపులు తెరుస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నా, అబ్కారీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన కూడళ్లలోని షాపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.