అపార చారిత్రక సంపద ధ్వంసం: హవాయిలో సముద్రపు సహజ రాతి ఆర్చ్ కూల్చివేత

రిపోర్టర్: సునీల్ స్థలం: Hawaii

హవాయిలోని ప్రసిద్ధ హోలెయి సీ ఆర్చ్ సముద్రపు అలల తాకిడికి కుప్పకూలినట్లు అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు తెలిపారు. సుమారు ఐదున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తొంభై అడుగుల అద్భుతమైన లావా రాతి నిర్మాణం ఒక్కసారిగా కనుమరుగైందని వెల్లడించారు. నిరంతర అలల కోత మరియు భూగర్భ అస్థిరత కారణంగానే ఈ చారిత్రక కట్టడం కూలిపోయిందని అధికారులు స్పష్టం చేశారు.