శ్రీకాకుళం వైసీపీలో చిచ్చు: బొత్సపై ధర్మాన తనయుడి సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. పక్క జిల్లాల నేతల పెత్తనం తమకు వద్దంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇవి బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనని పార్టీలో చర్చ నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్‌కు బొత్స మద్దతు ఇస్తున్నారనే అసంతృప్తితోనే చిన్ని ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమి తర్వాత నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి.