విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్: ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గట్టి షాకిచ్చిందని అధికారులు తెలిపారు. వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన డిస్కంల ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం నాన్ అగ్రికల్చర్ విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీలను రానున్న కరెంటు బిల్లుల ద్వారా వసూలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.