పెద్దపల్లిలో వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు చాటాలని బీజేపీ నేతల పిలుపు

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం ద్వారా ధర్మం, నీతి, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు అందించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.