విజయవాడలో ఉపాధ్యాయులపై దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ క్రీడా కోటా టీచర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, క్రీడా సంఘాలు నల్లబ్యాడ్జీలతో ఆందోళనలు నిర్వహించాయి. ఉపాధ్యాయులపై భౌతిక దాడులు, దూషణలను తీవ్రంగా ఖండిస్తూ, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసనలు తెలిపి, ప్రభుత్వ భద్రత కల్పించాలని కోరారు.