మాల్గుడి డేస్ ఫేమ్ మాస్టర్ మంజునాథ్ కుమారుడికి జాతీయ స్విమ్మింగ్ పతకాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Pune
మాల్గుడి డేస్ ధారావాహిక ద్వారా స్వామి పాత్రతో గుర్తింపు పొందిన మాస్టర్ మంజునాథ్ తన కుమారుడు వేదాంత్ జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూణే వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఓ జాతీయ పోటీల్లో వేదాంత్ తన స్నేహితులతో కలిసి రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. గత ఏడాది కూడా ఈ జాతీయ టైటిళ్లను నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.