పోలీస్ వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

రిపోర్టర్: విజయ్ స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్నోవా మరియు బొలెరో వాహనాలను ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పరిశీలించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ అధికారికంగా తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న పోలీస్ వాహనాల కండిషన్స్ మరియు వాటి పనితీరును స్వయంగా తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఈ తనిఖీల ద్వారా రవాణా వసతుల తీరును సమీక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు.