ఓటర్ల జాబితా నుంచి కోట్లాది హిందువుల పేర్లు గల్లంతు: యోగి ఆదిత్యనాథ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Lucknow

ఉత్తరప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నుంచి కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతు అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.