మద్యం దుకాణాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దాసపురం గ్రామస్తులు: ఎక్సైజ్ అధికారులకు వినతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని చిన్న గురుదాసుపురం జంక్షన్ వద్ద బెల్ట్ షాపులు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని పలు గ్రామాల ప్రజలు కోరారు. కాశీబుగ్గ ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం వారు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామాలను పూర్తిగా మద్యరహితంగా మార్చుకోవాలని గ్రామసభల్లో నిర్ణయించుకున్నామని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.