కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల భూ దోపిడీపై బీజేపీ ఫైర్
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ విమర్శించింది. గడచిన పదేళ్లలో బీఆర్ఎస్ ధరణి పేరుతో లక్షల ఎకరాల భూములు దోచుకుంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో అదే దోపిడీని కొనసాగిస్తోందని మండిపడింది. అసెంబ్లీలో బీజేపీ నిలదీసినా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించకుండా రెండు పార్టీలు కలిసి కాలయాపన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.