పల్నాడులో జనసేన సంచలనం: క్రోసూరు జడ్పీటీసీగా పమిడిపాటి శ్రీనివాసరావు భారీ విజయం
రిపోర్టర్: రమేష్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా క్రోసూరు జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు ముప్ పై వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావుకు ముప్ పై మూడు వేల ఆరు వందల ఐదు ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సిపిఎం అభ్యర్థి జి. రవిబాబు కేవలం మూడు వేల మూడు వందల ఐదు ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.