చిమ్మిర్యాలలో మూడు కోట్ల వ్యయంతో నూతన సబ్ స్టేషన్ ప్రారంభం

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

నారాయణపూర్ మండలం చిమ్మిర్యాల గ్రామంలో మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ముప్పైమూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేవని, ఉమ్మడి జిల్లాలోనే మునుగోడు అత్యంత వెనుకబడిన ప్రాంతమని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గంలో ఎక్కువ సబ్ స్టేషన్లు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.