ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును రెండు వారాల పాటు పొడిగించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ లేఖ రాశారు. కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారం పూర్తి కాకపోవడంతో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన వినతుల మేరకు గడువు పొడిగింపు కోరినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఈసీఐ నేడు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.