అమెరికాలో ఉత్కంఠగా మధ్యకాలిక ఎన్నికలు: మెయిన్ రాష్ట్రంలో గట్టి పోటీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Maine

అమెరికాలో మధ్యకాలిక ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. మెయిన్ రాష్ట్రంలో గవర్నర్, సెనేట్ మరియు ప్రతినిధుల సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్ లో రిపబ్లికన్, డెమొక్రటిక్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్ సెనేటర్ సూసన్ కొలిన్స్ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా, ప్రస్తుత గవర్నర్ జానెట్ మిల్స్ పదవీకాలం ముగియడంతో అక్కడ కూడా రాజకీయ పోరు రసవత్తరంగా మారింది.