మున్సిపల్ కార్పొరేషన్ల అధికారాలను కుదించేలా క్యూర్ చట్టంపై తీవ్ర అభ్యంతరాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టం మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల అధికారాలను కుదించేలా ఉందని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ చట్టం ద్వారా సీఎం అధ్యక్షతన అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుండగా మేయర్ల నిర్ణయాధికారాలకు తీవ్ర పరిమితులు ఏర్పడనున్నాయి.