ఓట్ల వేటలో జోరు పెంచిన టీడీపీ కూటమి అభ్యర్థులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని చెన్నరాజుపోడు పంచాయతీలో టీడీపీ అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసి అభ్యర్థి సుంకేసుల ఖైరున్ బి మరియు జెడ్పీటీసి అభ్యర్థి గూడూరు సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.