శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా ముగిశాయని తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎనిమిది రోజుల్లో ఐదు లక్షల డెబ్బై ఆరు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. ఇరవై ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల హుండీ కానుకలు వచ్చాయని, ముప్పై మూడు లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించామని వెల్లడించారు.