తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలు, వంతెనలు మరియు పంట పొలాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని తక్షణమే మళ్లించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నందిగామ వద్ద కూలిపోయిన వంతెన పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.