హైదరాబాద్లో కలకలం: దిల్ సుఖ్ నగర్ గుడిలో విగ్రహం ధ్వంసం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని దిల్ సుఖ్ నగర్ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం ఓ దుండగుడు వీరంగం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి ఆలయంలోకి చొరబడి పూజారిపై దాడికి యత్నించి, కర్రతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భక్తులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అడ్డుకుని చితకబాదారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.