అక్కపెళ్లిగూడ బడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నలుగురు కవలలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపెళ్లిగూడ ప్రభుత్వ పాఠశాలలో నలుగురు కవల పిల్లలు విద్యను అభ్యసిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుండడంతో వివిధ గ్రామాలకు చెందిన కవలలు ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థుల రూపురేఖలు ఒకేలా ఉండటంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తరచూ తికమకపడుతున్నారు. వారిని గుర్తించడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, వారికి బోధించడం ఎంతో ఆనందంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు.