తిరుమల శ్రీవారి నిరుపయోగ భూముల ద్వారా స్థిరాదాయానికి కసరత్తు

రిపోర్టర్: సురేష్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆస్తుల మదింపు, నిర్వహణను పకడ్బందీగా చేపట్టే దిశగా తితిదే కసరత్తు చేస్తోంది. భక్తులు విరాళంగా సమర్పించిన నిరుపయోగ భూములను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ విధానం ద్వారా వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి స్థిర ఆదాయం రాబట్టేందుకు ఐసీఏఐ సాంకేతిక సహకారం అందిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కొచ్చిలో తెలిపారు. తితిదే ఖాతాల నిర్వహణకు ఏఐ సాంకేతికతను జోడించి నూతన ఎకౌంటింగ్ మాన్యువల్ రూపకల్పన తుది దశకు చేరినట్లు ఆయన వెల్లడించారు.